Namaste NRI

ఈ సినిమాతో ఆ కల నెరవేరింది.. కేకే మీనన్‌

కేకే మీనన్‌ ప్రధాన పాత్రలో సుధాంశు శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం లవ్‌ ఆల్‌. బాలీవుడ్‌ ఫిల్మ్‌మేకర్‌ మహేష్‌భట్‌తో పాటు ఆనంద్‌ పండిట్‌, బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌ ఈ చిత్రానికి సమర్పకులు. ఈ నేపథ్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పుల్లెల గోపీచంద్‌ మాట్లాడుతూ ఇటీవల ఈ సినిమా చూశాను. ఈ చిత్రం అందరికి కనెక్ట్‌ అవుతుంది అన్నారు.  కేకే మీనన్‌ మాట్లాడుతూ బ్యాడ్మింటన్‌ నేపథ్యంలో కొనసాగే కథ ఇది. ఎప్పటి నుంచో క్రీడానేపథ్యంలో సినిమా చేయాలనుకుంటున్నాను. ఈ సినిమాతో ఆ కల నెరవేరింది. ఇది నాకు చాలా ప్రత్యేకమైన సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుంది అన్నారు. ఈ నెల 25న చిత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, బంగ్లా, ఒడియాతో పాటు సహా ఆరు భారతీయ భాషల్లో విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events