రష్యా ఎన్నికలపై యురోపియన్ యూనియన్ కామెంట్ చేసింది. ఆ ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదని ఫారిన్ పాలసీ చీఫ్ జోసెఫ్ బోర్నెల్ తెలిపారు. ఆ ఎన్నికల్లో అణిచివేత, బెదిరింపులకు పాల్పడినట్లు ఆయన ఆరోపించారు. రష్యా ఎన్నికల ఫలితాలపై త్వరలోనే 27 ఈయూ సభ్యదేశాలు సంయుక్త ప్రకటన చేయను న్నాయి. తాజాగా ముగిసిన దేశాధ్యక్ష ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ విజయం సాధించారు. అయిదోసారి ఆయన దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు.