అమెరికాలో కొవిడ్ 19 మహమ్మారి దశ అంతమైనట్లు అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఈ సందర్భంగా బైడెన్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని సమస్యలు ఉన్నా పరిస్థితి మాత్రం మెరుగువుతోందని ఆయన అన్నారు. వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రస్తుతం ప్రజలెవ్వరూ మస్క్‌లు ధరించడం లేదని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ మంచి స్థితిలో ఉన్నట్లు చెప్పారు. పరిస్థితి మారుతున్నట్లు ఆయన వెల్లడిరచారు.
అమెరికాలో కోవిడ్ వల్ల మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నా అధ్యక్షుడు మాత్రం ఈ ప్రకటన చేశారు. అయితే ప్రస్తుతం ప్రతి రోజు అమెరికాలో కోవిడ్ వల్ల సగటున 400 మంది మరణిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కరోనా మమహ్మారి చివరి దరకు చేరుకున్నట్లు ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికాలో ఇప్పటి వరకు కరోనా వల్ల 10 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.