పాకిస్థాన్‌కి చెందిన ఓ కుటుంబం అరుదైన ప్రపంచ రికార్డు సాధించింది. తొమ్మిది మంది సభ్యులు ఉన్న ఆ కుటుంబంలో అందరి పుట్టిన రోజు ఒక్కటే. తండ్రి అమీర్ అలీ, తల్లి ఖుదేజాతోపాటు వారి 19-30 ఏండ్ల మధ్య వయసుండే ఏడుగురు బిడ్డలు ఆగ స్టు 1నే పుట్టారట. కుటుంబంలోని అందరి బర్త్‌డే ఒకటే కావడం ప్రపం చ రికార్డు అని గిన్నెస్ వరల్డ్ రికార్డ్సు పేర్కొన్నది. మరో కొసమెరుపు ఏం టంటే, అమీర్, ఖుదేజాలకు వివా హం అయిన తేదీ కూడా 1991, ఆగస్టు 1 కావడం గమనార్హం. అంతకుముందు ఇలా అందరి పుట్టిన రోజు ఒకటిగానే ఉండే రికార్డు ఐదుగురు పిల్లలు ఉన్న అమెరికాకు చెంది న ఓ కుటుంబం పేరిట ఉండేదని గిన్నెస్ వరల్డ్ రికార్డ్సు తెలిపింది.
