ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో వివాదానికి కారణమైన ప్రముఖ నటుడు విల్ స్మిత్ అకాడమీ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. ఆస్కార్ వేడుకల్లో వ్యాఖ్యాత క్రిస్ రాక్‌పై విల్ స్మిత్ చేయి చేసుకున్నాడు. అయితే అది తనను ఎంతో బాధించిందని, తాన ప్రవర్తన క్షమించరానిదని తెలిపారు. ఈ నేపథ్యంలో తాను మోషన్ పిక్చర్ అకాడమీకి రాజీనామా చేస్తున్నానని, బోర్డు ఎలాంటి శిక్ష వేసినా దానికి తాను అంగీకరిస్తానన్నాడు. బోర్డు సభ్యులు తీసుకునే ఎలాంటి చర్యలకైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కాగా, స్మిత్ రాజీనామాను అంగీకరిస్తున్నామని, అకాడమీ ప్రకటించింది. అయితే అతనిపై చర్యలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేసింది.














