Namaste NRI

నా సినిమాల సక్సెస్‌కు అదీ ఒక కారణం : ప్రియదర్శి

ప్రియదర్శి  ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సారంగపాణి జాతకం. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ప్రియదర్శి విలేకరులతో  మాట్లాడుతూ ప్రస్తుతం కంటెంట్‌ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు. సామాన్యుడు విజేతగా నిలిచే కథలకు మంచి ఆదరణ లభిస్తున్నది. అందుకు పుష్ప, లక్కీ భాస్కర్‌ వంటి సినిమాలే నిదర్శనం అన్నారు.   జాతకాలను నమ్మాలా? లేదా? అనే విషయాలను ఈ సినిమాలో చర్చించడం లేదు. కానీ ఒకరి నమ్మకాల్ని మరొకరి మీద రుద్దితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూపిస్తున్నాం. జాతకాలను నేను కొంతవరకు నమ్ముతాను. కానీ వాటి గురించి పెద్దగా ఆలోచించను. ఇండస్ట్రీలో ఏదీ మన చేతిలో ఉండదు. ప్రయత్నం చేయడం వరకే మన పని అన్నారు.

ప్రేక్షకులను నవ్వించడం చాలా కష్టమైన విషయం. ఇంద్రగంటి మోహనకృష్ణ కామెడీ టైమింగ్‌ బాగుంటుంది. ఇందులో నా పాత్రను చాలా కొత్తగా డిజైన్‌ చేశారు. ఇప్పటివరకు నేను ఎక్కువగా తెలంగాణ మాండలికంలోనే మాట్లాడాను. కానీ ఈ సినిమాలో ఆంధ్ర యాసలో మాట్లాడతాను. నా కామెడీ టైమింగ్‌, డైలాగ్‌ డెలివరీ అన్నీ వైవిధ్యంగా ఉంటాయి. కామన్‌మేన్‌ పాత్రల్ని నేను బాగా ఇష్టపడతాను. నా సినిమాల సక్సెస్‌కు అదీ ఒక కారణం అనుకోవచ్చు. మల్లేశం, బలగం, కోర్ట్‌ వంటి సినిమాల కథలన్నీ మన చుట్టూ జరుగుతుంటాయి. అలాంటి సామాన్యుల కథల్లో తెలియని బాధ, ఉద్వేగాలుంటాయి. సారంగపాణి జాతకం లో జాతకాలను నమ్మే వ్యక్తిగా నా పాత్ర హిలేరియస్‌గా సాగుతుంది.

ప్రస్తుతం ఆడియెన్స్‌ ఫుల్‌ క్లారిటీతో ఉన్నారు. సినిమాలో విషయం ఉంటేనే థియేటర్లకు వస్తున్నారు. ఒకప్పుడు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణగారితో ఓ ఫొటో దిగితే చాలనుకునేవాడిని. అలాంటిది ఆయన సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా. శివలెంక కృష్ణప్రసాద్‌గారు గొప్ప నిర్మాత. ఆ రోజుల్లోనే ఆదిత్య 369  వంటి సినిమాను నిర్మించారంటే ఆయన విజన్‌ ఏమిటో అర్థం చేసుకోవచ్చు  అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events