అగ్ర కథానాయిక సమంత ఆరోగ్యంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని ఆమె సిబ్బంది తెలిపారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్లో ఓ ప్రముఖ ఆసుపత్రిలో సమంత వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దీంతో సమంత అనారోగ్యానికి గురయ్యేరనే ప్రచారం జరిగింది. అవాస్తవాలను నమ్మొదు. సమంతకు కొంచెం జలుబు, దగ్గు ఉండటంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆమె ఆరోగ్యం ఇప్పుడు పూర్తిగా బాగుంది. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు అని సమంత వ్యక్తిగత సిబ్బంది పేర్కొన్నారు. సమంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప నగరంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లారు. అనంతరం అక్కడి పెద్ద దర్గాను సందర్శించారు. హైదరాబాద్కు చేరుకున్న తర్వాత ఆమె స్వల్ప జ్వరం, దగ్గు లక్షణాలతో అస్వస్థతకు గురైంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)