రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉజ్బెకిస్తాన్‌లోని ఎన్‌సీఓ సమావేశంలో కలుసుకున్నారు. అయితే ప్రధాని మోదీ 72వ (సెస్టెంబర్ 17) బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోనున్న విషయం పుతిన్‌కు తెలిసినా.. మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పలేదు పుతిన్. ఎందుకు తాను విషెస్ చెప్పడం లేదన్న విషయాన్ని కూడా పుతిన్ వెల్లడిరచారు. రేపే బర్త్‌డే జరుపుకోనున్న ప్రియతమ మిత్రుడు మోదీకి బర్త్‌డే విషెస్ చెప్పలేకపోతున్నానని, కానీ ఇండియాకు ఆల్ ద బెస్ట్ చెబుతున్నానని, మోదీ రేపు బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోనున్నా, రష్యా సంప్రదాయం ప్రకారం మేం ముందుగా కంగ్రాట్స్ చెప్పమని పుతిన్ అన్నారు. అందుకే ఒక రోజు ముందు మోదీకి బర్త్ డే విషెస్ చెప్పడం లేదని పుతిన్ అన్నారు.