నాని నటించిన లేటెస్ట్‌మూవీ అంటే సుందరానికి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, రవిశంకర్.వై నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ట్రైలర్ చూస్తే సినిమాలో మరింత వినోదాన్ని పంచుతోంది. సుందర్, లీలా థామస్ పాత్రలో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేమకథకు నాని నాంది పలికారు. వివేక్ ఆత్రేయ మార్కు దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య భరిత సన్నివేశాలు ట్రైలర్‌లో ఉత్తమ భాగం, నాని, నజ్రియా తమ పాత్రలతో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం నాని బ్రహ్మణ యువకుడి పాత్రలో కన్పిస్తున్నారు. లీలా థామస్ అనే క్రిస్టియన్ యువతిగా నజ్రియా నటించారు. రొమాంటిక్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 10న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, కెమెరా: నికేత్ బొమ్మి, సిఈవో: చెర్రీ.
