రణధీర్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం సీతారామపురంలో ఒక ప్రేమజంట. నందినిరెడ్డి నాయిక. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ప్రేమకథా చిత్రం. ఎమ్.వినయ్‌బాబు దర్శకుడు. బీసు చందర్‌గౌడ్ నిర్మాత. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ టీజర్‌ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమకి అన్నివిధాల సహకరిస్తోంది. చిత్ర పరిశ్రమను ఇంకా డెవలప్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. చిత్ర పరిశ్రమలో ఇదివరకు ఆ నలుగురే నిర్మాతలు. వాళ్లే హీరోలు, వాళ్లవే థియేటర్లు అన్నట్టుగా ఉండేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. ఇంకా మారాలి. కొత్తవాళ్లు వస్తున్నారు. విజయాలు అందుకుంటున్నారు అన్నారు. సీతారామపురంలో ఒక ప్రేమ జంట చిత్రం కూడా బాగా ఆడాలని కోరుకుంటూ చిత్ర యూనిట్ కి నా శుభాకాంక్షలు అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ హీరో హీరోయిన్స్ కొత్తవారైనా ఎంతో అనుభవం ఉన్నవారిలా నటించారు. అసభ్యతకి తావు లేకుండా ఈ సినిమాని తెరకెక్కించామన్నారు. నిర్మాత బీసు చందర్ గౌడ్ మాట్లాడుతూ త్వరలోనే మా సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిన్ని శ్రీశైలం యాదవ్, మహేందర్ రెడ్డి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కాదంబరి కిరణ్ చిత్ర యూనిట్ పాల్గొన్నారు.