Namaste NRI

అది ఈ సినిమా ద్వారా సాధ్యమైంది : ప్రియదర్శి 

తేజ, తన్మయి జంటగా నటించిన చిత్రం 23. రాజ్ రాచకొండ ఈ  సినిమాను తెరకెక్కించారు.  ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి గీత రచయిత చంద్రబోస్, నటుడు ప్రియదర్శి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా   ప్రియదర్శి  మాట్లాడుతు మల్లేశం చిత్రంతో నా కెరీర్‌కు కొత్త ఊపిరినిచ్చారు దర్శకుడు రాజ్‌. ఆ కృతజ్ఞతతోనే ఈ వేడుకకు వచ్చాను. 23 చాలా గొప్ప కథ. ఇతర ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా చేయడం కుదరలేదు. చరిత్రకు సంబంధించిన ప్రశ్నల్ని అడగడం చాలా అవసరం. అది ఈ సినిమా ద్వారా సాధ్యమైంది అన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబోస్‌ సృజనాత్మకతకు పెద్దపీట వేసే దర్శకుడు రాజ్‌ అని కొనియాడారు. థియేటర్‌లోనే చూడాల్సిన చిత్రమిదని, యథార్ధ సంఘటనల స్ఫూర్తితో, సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కించామని దర్శకుడు పేర్కొన్నారు. ఈ నెల 16న 23 విడుదలకానుంది.  ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events