కొత్త సంవత్సరం వేసవి సీజన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలు చిత్రాలు రిలీజ్ డేటా బ్లాక్ చేసుకున్నాయి. తాజాగా నితిన్ నటిస్తున్న మాచర్ల నియోజక వర్గం సినిమా సైతం వేసవిలో రానుంది.ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టర్ విడుదల చేసింది. రాజకీయాంశాలు కలబోసిన వాణిజ్య చిత్రమిది. నితిన్ గతంలో చూడని విధంగా కొత్త అవతారంలో కనిపిస్తారు. పొలిటికల్ బ్యాడ్‌డ్రాప్‌లో నడిచే ఈ సినిమాలో ప్రేమకథ కూడా మెప్పిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ పక్కా కమర్షియల్ అంశాలతో వినోదాత్మక కథతో రూపొందిస్తున్న ఈ సినిమాలో పొలిటిక్ అంశాలు హైలెట్ కానున్నాయి. కృతి శెట్టి నాయికగా నటిస్తోంది. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న చిత్రమిది. ఈ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : మహతి స్వర సాగర్, ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ల, మాటలు: మామిడాల తిరుపతి. సమర్పణ : రాజ్‌కుమార్ ఆకెళ్ల. వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)