Namaste NRI

ఎలాన్ మస్క్ తో సంబంధం అలా మొదలైంది ..క్లెయిర్

నా ఐదు నెలల బిడ్డకు టెస్లా చీఫ్ ఎలాన్ మస్కే తండ్రి అని చెప్పి సంచలనం రేపిన రచయిత్రి అష్లీ సెయింట్ క్లెయిర్ ఇప్పుడు మస్క్తో తన సంబంధం ఎలా మొదలైందనే వివరాలను వెల్లడించింది. ఎలాన్ మస్క్ చాలా ఫన్నీగా ఉంటాడని 26 ఏళ్ల అష్లీ క్లెయిర్ చెప్పింది. ఆయన చాలా తెలివైన వ్యక్తని, సాదాసీదాగా ఉంటాడని, అందుకే ఆయన తన కలల్లోకి వచ్చాడని క్లెయిర్ పేర్కొంది. ఎప్పుడైనా శాన్ ఫ్రాన్సిస్కోకుగానీ, ఆస్టిన్కుగానీ వచ్చావా? అని ఒకానొక సందర్భంలో మస్క్ తనను అడిగాడని, దాంతో బాబీలోన్ బీ వెబ్సైట్కు పనిచేసిన సమయంలో పని నిమిత్తం తాను తరచూ ఆస్టిన్కు, టెక్సాస్కు వస్తూ ఉండేదాన్నని చెప్పానని అష్లీ క్లెయిర్ తెలిపింది. ఆ తర్వాత తాను మస్క్ను ఇంటర్వ్యూ చేసేందుకు శాన్ఫ్రాన్సిస్కోకు వెళ్లానని, ఇంటర్వ్యూ తర్వాత తమ ఇద్దరి మధ్య రొమాన్స్ మొదలైందని క్లెయిర్ చెప్పింది. ఆ తర్వాత మస్క్ నుంచి తన మొబైల్కు ఒక సందేశం వచ్చిందని, ఈ రాత్రికి రోడ్ ఐలాండ్కు వెళ్తున్నాం అనేది ఆ సందేశం సారాంశమని ఆమె వెల్లడించింది.
అలా మొదలైన తమ సంబంధం తాను గర్భం దాల్చే దాకా కొనసాగిందని క్లెయిర్ తెలిపింది. ఆ తర్వాత విషయం బయటికి రావద్దని మస్క్ తనను కోరాడని, అందుకే తన దగ్గరి వాళ్లతో మినహా మరెవ్వరికీ తన గర్భం గురించి తెలియకుండా జాగ్రత్త పడ్డానని ఆమె చెప్పింది. ప్రస్తుతం మస్క్ తనకు ఓ లగ్జరీ అపార్టుమెంట్, భారీగా ఆర్థిక భద్రత కల్పించారని కానీ ఇద్దరి మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదని పేర్కొంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events