Namaste NRI

కోబ్రా వచ్చేది అప్పుడే

విక్రమ్‌ హీరోగా నటించిన చిత్రం కోబ్రా. ఆర్‌.అజయ్‌ జ్ఞానమత్తు తెరకెక్కించారు. ఎస్‌.ఎస్‌. లలిత్‌ కుమార్‌ నిర్మాత. కేజీఎఫ్‌ ఫేమ్‌ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. తెలుగులో కోబ్రా చిత్రం హక్కులను నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ దక్కించుకున్నారు. వినూత్నమైన కథాంశంతో చక్కటి యాక్షన్‌ థ్రిల్లర్‌గా సినిమా ముస్తాబు చేశాం. ఈ చిత్రంలో గణిత మేథావి పాత్రలో విక్రమ్‌ కనిపిస్తారు. భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఓ కీలక పాత్ర పోషించారు అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాను ఈ నెల 31న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. ఈ సినిమాకు సంగీతం: ఏఆర్‌. రెహమాన్‌, హరీస్‌ కన్నన్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events