శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం స్వాగ్. హసిత్‌గోలి దర్శకత్వం. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా పతాకం పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 4న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని, వినూత్న కథాంశం తో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించే చిత్రమిదని దర్శకుడు తెలిపారు.

వింజమర వంశ నేపథ్యంలో హాస్యప్రధానంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కథానాయిక రీతూవర్మ మహారాణి రుక్మిణి పాత్రలో నటిస్తుండగా, హీరో శ్రీవిష్ణు నాలుగు విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నారు. మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్ తదితరులు చిత్ర తారాగణం.
