Skip to main content

Namaste NRI

తాప్సీ మిషన్‌ ఇంపాజిబుల్‌ విడుదలయ్యేది అప్పుడే

తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా మిషన్‌ ఇంపాజిబుల్‌. స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ఖరారు చేశారు. ఏప్రిల్‌ 1న ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని తీసుకొస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందుతో తాప్సీతో పాటు ముగ్గురు చిన్నారులు పరుగు తీస్తూ కనిపించారు.  తిరుపతి సమీపంలోని ఓ మారుమూల పల్లెటూరి నేపథ్యంగా కథ సాగుతుందని, ఆసక్తికర అంశాలతో సినిమా ఉంటుందని చిత్ర నిర్మాతలు తెలిపారు. మలయాళీ నటుడు హరీశ్‌ కీలక పాత్ర పోషించారు.  మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎన్‌ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  ఈ చిత్రానికి సంగీతం : మార్క్‌ కె.రాబిన్‌, ఛాయాగ్రహణం : దీపక్‌ యరగర, కూర్పూ : రవితేజ గిరిజల, కళ: నాగేంద్ర.

Social Share Spread Message

Latest News