అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బాంక్వెట్ విందుతో కార్యక్రమంలో ఉత్సవాలను ప్రారంభించారు. అమెరికాలో భారత రాయబారిగా ఉన్న తరుణ్‌జిత్ సింగ్ సంధు ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం ఆటా అధ్యక్షుడు భువనేశ్ భుజాల మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో ప్రముఖలకు అవార్డులను అందజేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి మల్లికార్జున రావు, అమెరికాలో సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఐకా రవి, సిలికాంధ్ర వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్, అమెరికాలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ చలసాని నాగ ప్రసాద్, ప్రముఖ కూచిపూడి కళాకారిణి లక్ష్మీ బాబు తదితరులకు అవార్డులను అందజేశారు. ప్రముఖ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్, రకుల్ ప్రీతిసింగ్ తమ ప్రసంగాలతో అలరించారు. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, పలువురు ప్రజా ప్రతినిధులు, కవులు, కళాకారులు, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తదితరులు హజరయ్యారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)