అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్ట్ ట్రంప్, కమలా హ్యారీస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుంది. ఒక పక్క పోలింగ్ ప్రక్రియ సాగుతుండగానే, మరో పక్క కౌంటింగ్‌ను మొదలుపెట్టేశారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్తి కమలా హరీస్ కంటే రిపబ్లికన్ పార్టీ అభ్యర్తి డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు.
ప్రస్తుతానికి ట్రంప్ 10 రాష్ట్రాల్లో విజయం సాధించారు. ఇండియానా, కెంటకీ, వెస్ట్ వర్జీనియా, మిస్సౌరి, ఫ్లోరిడా, మిస్సిసిప్పి, సౌత్ కరోలినా, టెన్నెసీ, అలబామా, ఓక్లహామాలో ట్రంప్ గెలుపొందారు. దీంతో ట్రంప్‌నకు 101 ఎలక్టోరల్ సీట్లు లభించాయి.ఇక 8 రాష్ట్రాల్లో కమలా హ్యారీస్ ఆధిక్యం కనబరిచారు. మేరీలాండ్, మస్సాచుసె ట్స్, కనెక్టికట్, న్యూజెర్సీ, రోడ్ ఐలాండ్, వెర్మాంట్‌లో కమల విజయం సాధించారు. దీంతో కమలకు 71 ఎలక్టోరల్ సీట్లు లభించాయి.
అత్యంత కీలకమైన స్వింగ్ స్టేట్ జార్జియాలో డోనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉండడంతో హారిస్‌కు పెద్ద ఎదురు దెబ్బ కానుంది. 2020లో జార్జియాలో డెమోక్రట్లకు 16 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. పెన్సిల్వేనియా, పిట్స్ బర్గ్, ఫిలడెల్ఫియాలో కమల ముందంజలో ఉండడంతో ఇద్దరు మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.