Namaste NRI

యూరప్‌ దేశాలకు దీటైన జవాబు.. ఇకనైనా ఆసియా వైపు

ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యాతో సత్సంబంధాలను కొనసాగిస్తున్న భారత్‌ మరోసారి తన వైఖరిని గట్టిగా సమర్థించుకుంది. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంలో తటస్థ వైఖరిని అవలంభిస్తున్నందుకు భారత్‌ను విమర్శిస్తున్న వారిపై విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఎదురు దాడికి దిగారు. ఆసియాకు ఎదురవుతున్న సవాళ్లను పశ్చిమ దేశాలు ఇప్పటిదాకా పట్టించుకోలేదని అన్నారు. అఫ్గానిస్తాన్‌తో పాటు పలు ఆసియా దేశాల్లో పరిణామాలు ప్రపంచానికే ప్రమాదకరంగా పరిణమించినా యూరప్‌ దేశృాలు పట్టించుకోలేదు. పైపెచ్చు మరింత వాణిజ్యం చేయాలంటూ మాకు సలహా ఇచ్చాయి అని రెజినా డైలాగ్‌ కార్యక్రమంలో  ఆయన విమర్శించారు. నార్వే, లక్జెమ్‌బర్గ్‌ విదేశాంగ మంత్రులు, స్వీడన్‌ మాజీ ప్రధాని ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఉక్రెయిన్‌ సంక్షోభం యూరప్‌ దేశాలకు మేలుకొలుపన్నారు. పదేళ్లుగా ఆసియాలో సవ్యమైన పరిస్థితులు లేవన్నారు. ఆసియాలో ప్రతీ దేశ ప్రాదేశీక సార్వభౌమత్వం ప్రమాదంలో పడినప్పటికీ పశ్చిమ దేశాలకు పట్టలేదని, ఇప్పుడు ఉక్రెయిన్‌ సంక్షోభంతోనైనా వాళ్లు ఈ ఖండంలో సమస్యలపై దృష్టి సారించాలన్నారు.

Social Share Spread Message

Latest News