Namaste NRI

ఆచార్య ఆగమనం ఆ రోజునే…

కరోనా వల్ల పలుమార్లు వాయిదా పడిన ఆచార్య కొత్త విడుదల తేదీగా ఫిబ్రవరి 4 ఖరారైన సంగతి తెలిసిందే. అయితే ఆ విడుదల తేదీ మారుతుందంటూ సామాజిక మాధ్యమాల్లో ఇటీవల ప్రాచారం సాగింది. ఆ ప్రచారాన్ని చిత్ర బృందం ఖండిరచింది. అనుకున్నట్టుగానే ఆచార్య ఫిబ్రవరి 4నే విడుదల అవుతుందంటూ ప్రకటించారు.

                చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య.  ఈ సినిమాలో చిరంజీవి ఆచార్యుడిగా, నక్సలైట్‌గా భిన్న కోణాలున్న పాత్రలో కనిపించనున్నారని చెబుతున్నారు. ఆచార్యకు అండదండగా నిలిచే సిద్ధ అనే శక్తివంతమైన పాత్రలో రామ్‌చారణ్‌ నటిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్‌, పూజాహెగ్డే కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్నందిస్తున్నారు. తిరుణ్ణావుక్కరుసు ఛాయాగ్రహణం బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. కొరటాల శివ దర్శకుడు. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మాతలు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న ప్రంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events