అల్లు అర్జున్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ముంబయ్‌లో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో బన్నీ మాట్లాడారు. నన్ను ఆర్య తో స్టార్‌ని చేసింది సుకుమార్. ఈ రోజు నేను సక్సెస్‌ఫుల్ హీరోగా ఉన్నానంటే కారణం సుకుమార్. నా ఎదుగుదలకు కారణం ఆయనే. ఇంత వేడుక జరుగుతున్నా ఆయన రాలేదు. ఇంకా సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నారు. ఇన్ని డబ్బులొస్తాయి. ఇంత పేరొస్తుంది అని లెక్కలేసుకొని చేసిన సినిమా కాదది. ప్రేక్షకులకు ఓ బెస్ట్ ఇవ్వాలి, గొప్ప ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలి అని చేసిన సినిమా. పుష్ప2 బిగ్గెస్ట్ ఇండియన్ సినిమా అయ్యిందంటే కారణం మీ ఆదరణే అని అన్నారు.
అయిదేళ్ల ప్రయాణం పుష్పతో స్పెషల్ బాండింగ్ ఏర్పడేలా చేసిందని, బన్నీకి జోడీగా నటించడం, సుకుమార్ లాంటి జీనియస్‌తో పనిచేయడం గొప్ప అనుభవమని కథానాయిక రష్మిక మందన్నా తెలిపారు. ఇంకా నిర్మాతలు కూడా మాట్లాడారు.