Namaste NRI

జూలై రెండో వారంలో బేబి వస్తోంది

ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం బేబీ. సాయి రాజేష్‌ దర్శకుడు. ఎస్‌కేఎన్‌ నిర్మించారు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో బేబీ సినిమా ఒకటి. ఈ చిత్రంలోని కొన్ని పాటలు ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను యూట్యూబ్‌ లో విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముందుగా ఈ సినిమా నుంచి ఓ రెండు మేఘాలిలా మరియు దేవరాజ అని రెండు పాటలు విడుదలై మంచి వ్యూస్ తెచ్చుకున్నాయి. ఇక ఈ మధ్య రష్మిక మందాన ఈ సినిమా నుంచి విడుదల చేసిన బ్రేకప్ సాంగ్ ప్రేమిస్తున్నా అయితే యూత్ కి వెంటనే కనెక్ట్ అయిపోయి సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా నుంచి నాలుగవ పాట కూడా ఈ వారం లో విడుదలకు సిద్ధంగా ఉంది.

నిర్మాత మాట్లాడుతూ ఇటీవల విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది.యువతరానికి నచ్చే అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఉండే సున్నితమైన భావోద్వేగాలు అందరిని ఆకట్టుకుంటాయి. విజయ్‌ బల్గానిన్‌ సంగీతం చిత్రానికి అదనపు వన్నెను తెచ్చింది అన్నారు.

ఈ చిత్రాన్ని జూలై రెండో వారంలో అనగా జులై 14 న విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మేకర్స్ బిజీగా ఉన్నారు. వీటిని కూడా త్వరగా పూర్తి చేసుకొని జూలైలో అందరినీ అలరించడానికి సిద్ధమవుతుంది ఈ సినిమా.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events