రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కేంద్రం నుంచి తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికార పార్టీ అధినేత కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ తెలంగాణ అంతా ఎంతో సుభిక్షంగా ఉందని ఇక్కడి ప్రజలకు ఎలాంటి సమస్యలు లేవని పదే పెదే చెబుతున్నారు. నేను పాదయాత్రకు వెళ్తున్నా, దమ్ముంటే నాతో కలిసి పాదయాత్రకు రండి. చేసిన అభివృద్ధి మీరు చూపించండి. ప్రజా సమస్యలను నేను చూపిస్తా. మీరు చెప్పినట్లు తెలంగాణలో ప్రజా సమస్యలే లేకపోతే నా ముక్కు నేలకు రాసి ఇంటికి వెళ్లిపోతా. అదే సమస్యలున్నట్లు నిరూపిస్తే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ పేరుతో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి అనేక మందిని ఉద్యోగాల నుంచి తొలగించారని, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగుల ఆత్మహత్యతలకు, హత్యలకు కేసీఆర్ కుటుంబయే కారమని ఆరోపించారు.














