స్క్రీన్‌ప్లే పిక్చర్స్ పతాకంపై నూతన నటీనటులతో అర్జున సాయి దర్శకత్వంలో రాజు, టి. శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న వెరైటీ లవ్ స్టోరీ మూవీ త్రికోణం. టి.సిద్ధార్థ, ప్రవీణ్ హీరోలుగా, ఐశ్యర హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవం తాజాగా హైదరాబాద్ సారధి స్టూడియోస్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు అర్జున్ సాయి మాట్లాడారు. ఇదొక డిఫరెంట్ లవ్ స్టోరీ అని తెలిపారు. ఈ చిత్రంలో ప్రముఖ నటి కీరోల్‌లో కన్పించనుందని తెలిపారు. కాకినాడ, రాజమండ్రి, హైదరాబాద్‌లో షూటింగ్ జరగనుందని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్, సంగీతం: శ్రీనివాస్, కో డైరెక్టర్ : దిలీప్, నిర్మాతలు: రాజు, టి.శ్రీనివాస్, దర్శకత్వం: అర్జున్ సాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)