అమెరికాలో ఇండియన్స్ రెస్టారెంట్‌కు అరుదైన గౌరవం దక్కింది. మన ఇండియన్స్ ఏర్పాటు చేసిన చాయ్‌పానీ స్ట్రీట్ ఫుడ్ రెస్టారెంట్ ఉత్తమ రెస్టారెంటుగా ఎంపికైంది. ఈ ఏడాదికి గాను చాయ్‌పానీని ఎంపిక చేసింది. చికాగోలోని జేమ్స్ బియర్డ్ ఫౌండేషన్ ఏటా ఈ అవార్డులను ప్రకటించింది. నార్త్ కరోలినాలోని అష్‌విల్లేలో ఉన్న ఈ రెస్టారెంటు అందరికీ సుపరిచితమే. ఇక్కడ దొరికే చాట్ చాలా ఫేమస్. పైగా ఇక్కడ ధరలు కూడా వేరే రెస్టారెంట్లతో పోలిస్తే తక్కువగా ఉంటాయని చెబుతుంటారు. న్యూ ఆర్లియెన్స్‌కు చెందిన బ్రెన్నన్స్ వంటి ప్రముఖ రెస్టారెంట్‌ను సైతం చాయ్ పానీ వెనుకకు నెట్టడం విశేషం. కాగా గతంలో ఈ అవార్డును న్యూయార్క్ లేదా షికాగాలోని రెస్టారెంట్లే చేజిక్కించుకునేవి. తొలిసారి భారత వంటకాలకు పేరొందిన రెస్టారెంట్ అమెరికాలో నంబర్ వన్‌గా నిలిచింది. చాయ్ పానీ రెస్టారెంట్ ఇండియన్ స్నాక్స్‌కు చాలా ఫేమస్. ఇక్కడ తయారు చేసే చాట్ తినేందుకు అమెరికన్లు పడిచస్తుంటారు. చాయ్ పానీ భిన్న రకాల రుచుల్లో పసందైన చాట్లను, ఇతర వంటకాలను వేడివేడిగా అందిస్తుంటుంది.














