Namaste NRI

నా కెరీర్‌లో చేసిన పెద్ద సినిమా మాత్రం ఇదే : చేతన్‌కృష్ణ

చేతన్‌కృష్ణ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ధూం ధాం.  సాయికిషోర్‌ మచ్చా దర్శకత్వం.  ఈ చిత్రాన్ని ఎంఎస్‌ రామ్‌కుమార్‌ నిర్మించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హీరో చేతన్‌కృష్ణ మాట్లాడుతూ ఇప్పటివరకు విభిన్న కథా చిత్రాల్లో నటించా. అయితే నా కెరీర్‌లో చేసిన పెద్ద సినిమా మా త్రం ఇదే అన్నారు.  ఫస్ట్‌ర్యాంక్‌ రాజు, బీచ్‌రోడ్‌ చేతన్‌, రోజులు మారాయి. గల్ఫ్‌ చిత్రాల ద్వారా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నా. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఫుల్‌లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అలాంటి సమయంలో ఈ కథ కుదిరింది అన్నారు.

సినిమా కథ గురించి చెబుతూ తన కొడుకు అన్నింట్లో ది బెస్ట్‌గా ఉండాలని తపిస్తుంటాడు తండ్రి. ఆయన చేసిన గారాబంతో కొడుకు మరింత అల్లరివాడవుతాడు. అతని వల్ల ఓ అమ్మాయి సమస్యలో చిక్కుకుంటుంది. దానికి తానే పరిష్కారం చూపించాలని హీరో చేసే ప్రయత్నమే ఈ సినిమా ఇతివృత్తం అన్నారు. సెకండాఫ్‌లో వెన్నెల కిషోర్‌ కామెడీ ప్రధానాకర్షణగా నిలుస్తుందని, చాలా మంది సీరియర్‌ ఆర్టిస్టులు భాగం కావడం వల్ల సినిమాకు భారీతనం వచ్చిందని చేతన్‌కృష్ణ తెలిపారు. ప్రస్తుతం నడుస్తున్న థ్రిల్లర్స్‌ ట్రెండ్‌కు భిన్నంగా చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ధూం ధాం ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 8న విడుదలకానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events