Skip to main content

Namaste NRI

కలకలం రేపుతున్న బాంబు బెదిరింపులు.. ఈ ఒక్క రోజే ఎన్నంటే?

భారత విమానయాన సంస్థలకు వస్తున్న నకిలీ బాంబు బెదిరింపులు ఆగటం లేదు. గురువారం ఒక్కరోజు 80కిపైగా దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎయిర్‌ ఇండియా, విస్తారా, ఇండిగోలలో ప్రతి సంస్థ నుంచి కనీసం 20 విమానాలకు, ఆకాశ ఎయిర్‌లైన్స్‌ 13 ఫ్లైట్స్‌కు, అలయన్స్‌ ఎయిర్‌, స్పైస్‌ జెట్‌ సంస్థలకు చెందిన 5 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్టు సంబంధిత వర్గాలు ప్రకటించాయి. గత 11 రోజుల్లో సుమారు 250 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

Social Share Spread Message

Latest News