Namaste NRI

ఈ చిత్ర వసూళ్లు ధైర్యాన్నిచ్చాయి : వంశీ నందిపాటి

సుహాస్‌, శివాని నాగారం జంటగా నటించిన కామెడీ ఎంటర్‌టైనర్‌ హే బలవంత్‌. గోపీ అచ్చెర దర్శకుడు. బి.నరేంద్రరెడ్డి నిర్మాత. ఇటీవలే సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా థాంక్యూ మీట్‌లో వంశీ నందిపాటి మాట్లాడారు. నిర్మాత పెట్టిన డబ్బు రికవరీ అయితేనే సినిమా విజయం సాధించినట్టు లెక్క. హే బలవంత్‌ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ అయ్యింది. పెట్టిన ఖర్చు తిరిగొచ్చింది. పదికోట్ల బడ్జెట్‌తో సినిమాను నిర్మించాం. ఓటీటీ, శాటిలైట్‌, థియేటర్స్‌ కలెక్షన్స్‌ అన్నీ కలిసి మా పదికోట్లు మాకు తిరిగొచ్చాయి. ఇక వచ్చేవన్నీ లాభాలే. ఈ సినిమాను విడుదల చేసిన వ్యక్తిగా ధైర్యంగా చెబుతున్న మాట ఇది అని వంశీ నందిపాటి చెప్పారు. ఈ సినిమా విజయం సాధించిందంటూ హీరోహీరోయిన్లు సుహాస్‌, శివానీ నాగారం, నిర్మాత బి.నరేంద్రరెడ్డి, దర్శకుడు గోపీ అచ్చెర అనందం వెలిబుచ్చారు.

Social Share Spread Message

Latest News