Namaste NRI

సందడిగా సాగిన సురాపానం ట్రైలర్‌ విడుదల కార్యక్రమం

సంపత్‌కుమార్‌ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం సురాపానం. ప్రగ్యా నయన్‌ హీరోయిన్‌. మట్ట మధుయాదవ్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న రిలీజ్‌ కానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు.  ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ ప్రాంతం నేపథ్యంలో మంచి సినిమాలు తెరకెక్కుతున్నాయి. వినోదం, ఆశ్చర్యం, ఆసక్తి అంశాలతో పాటు మంచి ప్రమేకథ సురాపానం లో ఉంటుంది. సంపత్‌కుమార్‌ ఏడేళ్లుగా మాతో ప్రయాణిస్తున్నాడు. సురాపానం సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు. సంపత్‌ కుమార్‌ మాట్లాడుతూ  ఇవాళ కంటెంట్‌ పరంగా చాలా పోటీ నెలకొంది. ఎన్నో తరహాల సినిమాలు వస్తున్నాయి. కానీ ఇలాంటి జానర్‌ సినిమా రాలేదని చెప్పగలను. కంటెంట్‌ పరంగా ఇది పెద్ద చిత్రమే అని అన్నారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాలు ఇండస్ట్రీలో ఉండవు. ఏ సినిమా ఎలాంటిది అనేది రిలీజ్‌ అయ్యాక ప్రేక్షకులు నిర్ణయిస్తారు. ఇప్పటి వరకు చూడని ఓ కొత్త కథను సురాపానం చిత్రంలో చూస్తారు. ఫన్‌, ఎమోషన్‌, లవ్‌, ఇలా అన్నీ అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి అన్నారు ప్రగ్యా నయన్‌. ఈ కార్యక్రమంలో నాయిక ప్రగ్యా నయన్‌,  మీసాల లక్ష్మణ్‌, ఫిష్‌ వెంకట్‌లతో పాటు చిత్ర యూనిట్‌ పాల్గొంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events