అమెరికా ప్రభుత్వంపై ఎన్నారైలు కోర్టుకెక్కారు. తమ తప్పులేకపోయినా హెచ్-1బీ వీసాలను నిలిపివేయడంపై అభ్యంతరం చెబుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాషింగ్టన్ స్టేట్లోని ఫెడరల్ కోర్టులో ఈ కేసు దాఖలైంది. తమకు ఉద్యోగం ఇచ్చిన సంస్థల మోసపూరిత కార్యకలాపాల గురించి తమకు అస్సలు తెలీదని బాధితులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. కానీ ఈ నేరానికి తమను అన్యాయంగా శిక్షిస్తున్నారని వాపోయారు. ప్రస్తుతం తామందరం చట్టబద్ధమైన సంస్థల్లో పనిచేస్తున్నప్పటికీ తమకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రత్యేక వృత్తులకు సంబంధించిన హెచ్-1బీ వీసాను నిరాకరిస్తోందని పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలు సంబంధం ఉన్న వారందరూ మోసపూరిత చర్యలు పాల్పడి వీసాలు పొందినట్టు ప్రభుత్వం భావిస్తోంది అని బాధిత భారతీయుల తరపు లాయర్ జోనథన్ పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని మోసం చేసినట్టు తమపై వచ్చిన ఆరోపణలపై స్పందించేందుకు తమకో అవకాశం ఇవ్వాలని పిటిషనర్లు కోర్టును వేడుకున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)