Namaste NRI

కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న

 ర‌ష్యా- ఉక్రెయిన్ వార్ నేప‌థ్యంలో దేశంలో పెట్రో ధ‌ర‌లు పెరుగుతాయ‌ని పెద్ద ప్ర‌చారం సాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్ప‌టి నుంచే పెట్రో ట్యాంకుల‌ను నింపేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో పెట్రో ధ‌ర‌లు పెరుగుతాయా? అన్న దానిపై కేంద్ర పెట్రోలియం మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరీ స్ప‌ష్ట‌త నిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకున, పెట్రో ధ‌ర‌ల పెంపు విష‌యంలో ఓ నిర్ణ‌యానికి వ‌స్తామ‌ని పేర్కొన్నారు. చ‌మురు ధ‌ర‌లు ప్ర‌పంచ ధ‌ర‌ల బట్టి నిర్ణ‌యం అవుతాయి. ప్ర‌పంచంలో ఓ ప్రాంతంలో యుద్ధ వాతావ‌ర‌ణం అలుముకుంది. పెట్రో ధ‌ర‌ల పెంపు ప్ర‌జా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే వుంటుంది అని ప్ర‌క‌టించారు. ఐదు రాష్ట్రాల ఎన్నిల కార‌ణంగానే పెట్రో ధ‌ర‌లు పెంచడం లేద‌న్న వార్త‌ల్లో ఏమాత్రం వాస్త‌వం లేద‌ని తేల్చి చెప్పారు. అయితే ఇంధ‌న అవ‌స‌రాలను తీర్చేలా చూసే బాధ్య‌త మాత్రం త‌మ‌దేన‌న్నారు. అతి త్వ‌ర‌లోనే పెట్రో కంపెనీలు దీనిపై నిర్ణ‌యం తీసుకుంటాయ‌ని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events