ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. యెమెన్ లోని సనా అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ఎక్కేందుకు వేచి ఉండగా వైమానిక బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో విమానాశ్రయంలో ఉన్న టెడ్రోస్ ప్రాణాలతో బయటపడ్డారు. కాగా, ఖైదీల విడుదలపై చర్చలు, యెమెన్‌లో ఆరోగ్యం, మానవతా పరిస్థితులను అంచనా వేసేందు కు టెడ్రోస్ ఐక్యరాజ్యసమితికి చెందిన ఉద్యోగులతో కలిసి అక్కడికి వెళ్లారు. చర్చల అనంతరం తిరుగు ప్రయాణంలో విమానం కోసం సనా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ సమయంలో విమానాశ్రయంపై ఇజ్రాయెల్ వైమానికి బాంబు దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అదృష్టవశాత్తూ టెడ్రోస్ ప్రాణాలతో బయటపడ్డారు. మరోవైపు ఈ దాడిని ఐక్యరాజ్యసమితి ఖండించింది.