Namaste NRI

ఆ లైబ్ర‌రీ మూసివేత‌.. డోనాల్డ్ ట్రంప్‌పై విమ‌ర్శ‌లు

అమెరికాలోని నాసాకు చెందిన గోడార్డ్ స్పేస్ ఫ్ల‌యిట్ సెంట‌ర్‌లో ఉన్న అతిపెద్ద లైబ్ర‌రీ ని మూసివేశారు. జ‌న‌వ‌రి 2వ తేదీన దాన్ని శాశ్వ‌తంగా మూసివేశారు. ఆ లైబ్ర‌రీ 1959 నుంచి ఆప‌రేష‌న్‌లో ఉన్న‌ది. నాసా చేప‌ట్టిన ఎన్నో కీల‌క ప్ర‌యోగాల్లో ఆ లైబ్రరీ కూడా ముఖ్య పాత్ర‌ను పోషించింది. హ‌బుల్ స్పేస్ టెలిస్కోప్, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ లాంటి కీల‌క ప్రాజెక్టుల స‌మ‌యంలో ఆ లైబ్ర‌రీ స‌పోర్టు ఇచ్చింది. సుమారు ల‌క్ష పుస్త‌కాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్ర‌భుత్వ ప్లానింగ్‌లో భాగంగా నాసా లైబ్ర‌రీని మూసివేస‌త్ఉన్నారు.

మేరీల్యాండ్‌లో ఉన్న నాసా కేంద్రం సుమారు 1270 ఎక‌రాలు ఉంటుంది. దీంట్లో ఉన్న 13 బిల్డింగ్‌లు, వంద‌కుపైగా సైన్స్‌, ఇంజినీరింగ్ ల్యాబ్‌ల‌ను మూసివేస్తున్నారు. నాసా ప్ర‌తినిధి జాక‌బ్ రిచ్‌మండ్ దీనిపై మాట్లాడారు. లైబ్ర‌రీలో ఉన్న క‌లెక్ష‌న్‌కు చెందిన విలువ‌ను రెండు నెల‌ల్లో అంచ‌నా వేయ‌నున్న‌ట్లు చెప్పారు. కొంత లైబ్ర‌రీ మెటీరియ‌ల్‌ను ప్ర‌భుత్వ వేర్‌హౌజ్‌కు పంప‌నున్నారు. కొంత చెత్త‌బుట్ట‌లో వేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events