అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన చిత్రం యానై. రాధికా శరత్‌కుమార్, యోగిబాబు, కేజీఎఫ్ రామచంద్రరాజు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఏనుగు పేరుతో తెలుగులోకి వస్తున్నది. ఈ చిత్రాన్ని శ్రీమతి జగన్మోహినీ సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సీహెచ్ సతీష్ కుమార్ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత సీహెచ్ సతీష్ కుమార్ మాట్లాడుతూ ఆద్యంతం వినోదాన్ని అందించే చిత్రమిది. సింగం సినిమాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హరి అదే స్థాయిలో మంచి కంటెంట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. యానై ని ఏనుగు టైటిల్‌తో తెలుగులో రిలీజ్ చేస్తుండటం సంతోషంగా ఉంది. ఈ నెల 17న సినిమా విడుదల చేయాలని అనుకుంటున్నాము అన్నారు. హరి దర్శకుడు. సంగీతం: జీవీ ప్రకాష్, ఛాయాగ్రహణం : గోపీనాథ్.
