నస్లెన్ గఫూర్ హీరోగా నటించిన తాజా చిత్రం జింఖానా. ఖలీద్ రెహమాన్ దర్శకుడు. ఈ స్పోర్ట్స్ డ్రామాను శ్రీలక్ష్మి నరసింహ మూవీ మేకర్స్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నది. ఈ చిత్రం నిర్వహించిన ప్రీరిలీజ్ వేడుకకు ప్రముఖ దర్శకుడు హరీష్‌శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమా కంటెంట్ అదిరిపోయింది. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు.ఈ సినిమా మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిందని, నస్లెన్ అద్భుతమైన పర్‌ఫార్మెన్స్ కనబరిచాడని, దర్శకుడు ఖలీద్ రెహమాన్ బాక్సర్ కాబట్టి అదే నేపథ్యంలో అద్భుతంగా చిత్రాన్ని తీశాడని ప్రశంసించారు.

స్పోర్ట్స్ కామెడీ చిత్రమిదని, మంచి యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు అలరించే పాటలుంటాయని దర్శకుడు ఖలీద్ రెహమాన్ తెలిపారు. ఈ సినిమాలో అందరూ హీరోలేనని, అద్భుతమైన హాస్యంతో ఆకట్టుకుంటుందని హీరో నస్లెన్ అన్నారు. భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నామని నిర్మాత తెలిపారు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది.
