Namaste NRI

ఈ పెను ఖరీదు రూ. 7 లక్షలు !

ఒక పెను ధర మాములగా రూ.3 నుంచి రూ.1000 వరకు ఉంటుంది. ఏదైనా ప్రత్యేకత కలిగినవైతే రూ.వేలల్లో ఉంటుంది. కానీ బెంగళూరులోని కోరమంగళలో విలియమ్‌ పెన్స్‌ సంస్థ మాత్రం రూ.7 లక్షల విలువైన ఓ పెన్‌ ను విక్రయానికి ఉంచింది. ఈ సంస్థ 20 ఏళ్లుగా బ్రాండెడ్‌ పెన్‌లను విక్రయిస్తోంది. ఇక్కడ రూ.10 వేల విలువైన పెన్నులు అమ్ముడవుతున్నాయి. రూ.35 విలువ చేసే పెన్నులను కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి కనబరుస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ క్రమంలో ఇటీవల విదేశాలకు చెందిన వివిధ రకాల ఖరీదైన పెన్నులను విలియమ్‌ పెన్స్‌ విక్రయానికి ఉంచింది. వాటిలో స్విట్జర్లాండ్‌కు చెందిన కరన్‌డాష్‌ సంస్థ రూపొందించిన ఓ పెను ధర ఏకంగా రూ. 7 లక్షలు. దీని తయారీలో బంగారంతో పాటు అత్యంత విలువైన రాళ్లను వాడటం వల్లే దాని విలువ రూ.7 లక్షలుగా నిర్ణయించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events