అంతర్జాతీయ చెస్ సంఘం సంచలన నిర్ణయం తీసుకున్నది. ట్రాన్స్‌జెండర్ మహిళా చెస్ ప్లేయర్లపై ప్రపంచ చెస్ సమాఖ్య నిషేధం విధించింది. మహిళల ఈవెంట్లల్లో ట్రాన్స్‌జెండర్ మహిళలు ఆడరాదు అని కొత్త పాలసీని రూపొందించింది. ఇంటర్నేషనల్ చెఫ్ ఫెడరేషన్ కొత్త మార్గదర్శకాల ప్రకారం ట్రాన్స్‌జెండర్ మహిళా చెస్ ప్లేయర్లు. ఇక నుంచి మహిళల ఈవెంట్లలో పాల్గొనరాదు. అయితే తదుపరి విశ్లేషణ జరిగే వరకు ఈ నిషేధం కొనసాగనున్నది. ట్రాన్స్‌జెండర్ మహిళగా గెలిచిన టైటిళ్లను రద్దు చేయనున్నట్లు ఫిడే తెలిపింది. క్రీడాకారులు తమ లింగాన్ని మార్చుకున్న విషయాన్ని చెస్ పోటీల నిర్వాహకులకు తెలియజేయాలని ఫిడే చెప్పింది. ఫిడే తీసుకున్న నిర్ణయాన్ని గే మద్దతుదారులు వ్యతిరేకిస్తున్నారు. ఇది ట్రాన్స్ మహిళల్ని అవమానించడమే అని కొందరన్నారు.
