వంశీరామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏవూరి హరి ప్రధానపాత్రధారులుగా రూపొందిన చిత్రం రేవు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ రేవుల దగ్గర జీవనం సాగించే మత్స్యకారుల ఇబ్బందులే ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని రేవు సినిమా చేయడం నిజంగా మంచి ప్రయత్నం. కొత్తవాళ్లతో సినిమా చేశారని తెలిసినప్పుడు సినిమాపై ఆసక్తి పెరిగింది. దర్శకుడు హరినాథ్ పులి చూడటానికి చిన్నవాడైనా, సినిమా బాగా తీస్తారు.

ఈ చిన్న సినిమా మౌత్ టాక్‌తో పెద్ద హిట్ సాధించాలి. నిర్మాతలు డా.మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లిలకు ఆర్ధికంగా లాభాలు రావాలి. అలాగే, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు ఈ సినిమాకు ప్రొడక్షన్ పర్యవేక్షకులుగా, మరో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాతో వాళ్లు సక్సెస్ సాధించాలి అని ఆకాంక్షించారు. రామ్‌గోపాల్‌వర్మ, అనన్య నాగళ్ల, సంపత్‌నంది, ఉత్తేజ్ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. గురుతేజ్, సుమేశ్ మాధవన్, హేమంత్ ఉద్భవ్, లీలా వేంకటేశ్ కొమ్మూరి తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: రేవంత్ సాగర్, నేపథ్య సంగీతం: వైశాక్ మురళీధరన్.
