అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం బుట్ట బొమ్మ. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ సందర్భగా దర్శకుడు మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యంగా సాగే ఆహ్లాదకర ప్రేమ కథ ఇది. ప్రేమలోని పలు కోణాలను స్పృశిస్తూ సాగుతుంది. ప్రధాన పాత్రలు సహజంగా ఉంటూ ఆకట్టుకుంటాయి అన్నారు. నవ్య స్వామి, నర్రా శీను, పమ్మి సాయి. కార్తీక్ ప్రసాద్, వాసు ఇంటూరి తదితరులు ఇతర పాత్రలో నటిస్తున్నారు. తుది దశ నిర్మాణ పనుల్లో ఉన్న సినిమా వచ్చే జనవరి 26న విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటిచింది.ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, సంగీతం: గోపీసుందర్.














