Namaste NRI

మా దేశ ఆర్థిక స్థితికి ..భార‌త్ కానీ, అమెరికా కార‌ణం కాదు

పాకిస్థాన్‌ ఆర్థికంగా బ‌ల‌హీన‌ప‌డ‌డానికి భార‌త్ కానీ, అమెరికా కానీ కార‌ణం కాదు అని ఆ దేశ మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ తెలిపారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్ న‌వాజ్ పార్టీ త‌ర‌పు టికెట్లు ఆశిస్తున్న వారితో జ‌రిగిన స‌మావేశం లో న‌వాజ్ ష‌రీఫ్ మాట్లాడుతూ  మ‌న విధానాలే మ‌న‌ల్ని ఆర్థిక సంక్షోభం దిశ‌గా తీసుకువెళ్లిన‌ట్లు ఆయ‌న చెప్పారు. శ‌క్తివంత‌మైన సైన్యం వ‌ల్లే ఈ ప‌రిస్థితి త‌లెత్తిన‌ట్లు ఆయ‌న ఆరోపించారు. 1993లో, 1999లో, 2017లో త‌మ ప్ర‌భుత్వాన్ని మిలిట‌రీనే కూల్చింద‌న్నారు. పాకిస్థాన్ ఆర్థికంగా వెనుబ‌డి ఉండానికి భార‌త్ కానీ, అమెరికా కానీ, ఆఫ్ఘ‌నిస్తాన్ కానీ కార‌ణం కాదన్నారు. సైన్యం జోక్యం వ‌ల్ల ఈ ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. 2018లో ఎన్నిక‌ల‌ ను రిగ్గింగ్ చేయ‌డం వ‌ల్ల ప్ర‌స్తుతం ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తోంద‌ని, దేశ ఆర్థిక స్థితి కూడా క్షీణించిన‌ట్లు ష‌రీఫ్ తెలిపారు. అయితే నాలుగోసారి పాక్ ప్ర‌ధాని కావాల‌ని న‌వాజ్ ష‌రీఫ్ భావిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events