మూడు రోజుల్లో ప్రపంచం అంతం కాబోతున్నదా? 1960 నాటి జోస్యం నిజమవుతుందా? అనే విషయాలు తాజాగా చర్చనీయాంశం అయ్యాయి. జనాభా పెరిగిపోతే, ప్రజలకు తగినంత ఆహారాన్ని అందించే స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులు పెరగబోవని, ఆకలి చావులు పెరుగుతాయని శాస్త్రవేత్తలు 1960వ దశాబ్దంలో ఆందోళన వ్యక్తం చేశారు. డూమ్స్‌డే: ఫ్రైడే 13 నవంబర్ 2026 శీర్షికతో సైన్స్‌లో ప్రచురితమైన వ్యాసంలో 2026 నవంబర్ 13నాటికి మానవ జనాభా అనంతం అవుతుందని ప్రొఫెసర్ హీంజ్ వోన్ ఫోర్స్టెర్ బృందం చెప్పింది.

జనాభా ఎంత వేగంగా పెరిగినప్పటికీ, ఫుడ్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ సైన్స్ కూడా అదే వేగంతో అభివృద్ధి చెందుతాయని ఫోర్స్టెర్ వాదించారు. ఆయన గణిత సూత్రాల ఆధారంగా డూమ్స్డేను లెక్కించగా, జియాలజిస్ట్ డాక్టర్ మైఖేల్ టెక్లా మాత్రం సూర్యుడి నుంచి మునుపెన్నడూ లేనంత తీవ్రమైన శక్తి 2026 నవంబర్ 13న విడుదలవుతుందని, భూమి అయస్కాంత క్షేత్రంలో తీవ్రమైన అంతరాయాలు ఏర్పడతాయని, ఫలితంగా భూమిపై విపరీతమైన విధ్వంసం జరుగుతుందని చెప్పారు.















