అమెరికా నేవీలో మహిళా శకం మొదలైంది. ఓ మహిళ కఠిన శిక్షణ పూర్తి చేసుకుని సెయిలర్‌గా నియమితురాలైంది. అగ్రరాజ్య సైనిక చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించింది. అమెరికాకు చెందిన స్పెషల్ వార్‌ఫరేర్ క్రాఫ్ట్ క్రూమ్యాన్ (ఎస్‌డబ్ల్యూసీసీ)లో సెయిలర్ ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మహిళలు కూడా ఉన్నారు. అయితే 37వారాల పాటు ఎంతో కఠోరంగా సాగే ఈ సెయిలర్ ఉద్యోగాల శిక్షణలో ఏటా 65 శాతం మంది మధ్యలోనే వదిలేసి వెళ్తుంటారు. కానీ ఓ మహిళ మాత్రం పురుషులతో సమానంగా విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుంది. పెంటగాన్ పాలసీ ప్రకారం ఈ మహిళ పేరును అమెరికన్ నేవీ అధికారులు వెల్లడిరచలేదు.
ఇప్పటివరకు సెయిలర్ ఉద్యోగాల కోసం 18 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. 14 మంది మధ్యలోనే ఇంటిముఖం పట్టారు. మరో ముగ్గురు ఇంకా శిక్షణ దశలో ఉన్నారు. ఆయుధాల వాడకం, నావిగేషన్, స్పీడ్‌బోటింగ్ జారవిడవడం, సముద్రలోతుల్లో నుంచి ఆక్సిజన్ లేకుండా బయటకు రావడం, ప్యారాచూట్ జంపింగ్ వంటి కఠోర శిక్షణ ఇస్తారు. చివరగా 72 గంటల పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఛాలేంజింగ్ ఎన్విరాన్‌మెంట్‌లో 23 గంటల పాటు రన్నింగ్, 5 మైళ్ల స్విమ్మింగ్ కూడా ఉంటుంది. ఇవి సెయిలర్స్ భౌతిక, మానసిక దృఢత్వాన్ని అంచనా వేయడానికి సహాయపడతాయి. 2016లో అప్పటి ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాల్లో భాగంగా నేవీలోకి మహిళలను తీసుకోవడం ప్రారంభించారు.