వెంకటేష్, వరుణ్‌తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఎఫ్`3. దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ 28న విడుదలకానుంది. టాకీ పార్ట్ పూర్తియింది. ఒక పాట చిత్రీకరణ బ్యాలెన్స్‌గా ఉంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంపూర్ణ హాస్యంతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రమిది అని నిర్మాత తెలిపారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ రోజువారీ వ్యవహారాలతో ఒత్తిళ్లకు లోనవుతున్న వారందరికీ ఓ దివ్యౌషదంలా ఎఫ్`3 చక్కటి వినోదాన్ని పంచుతుంది. ఈ సినిమాలో ఫ్రస్ట్రేషన్ మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలో పుట్టే హాస్యం కడుపుబ్బా నవ్విస్తుంది అన్నారు. తమన్నా, మెహరీన్, సోనాల్‌చౌహాన్, రాజేంద్రప్రసాద్, సునీల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం దేవిశ్రీప్రసాద్, సహనిర్మాత: హర్షిత్ రెడ్డి, నిర్మాత: శిరీష్, దర్శకత్వం: అనిల్ రావిపూడి.