Skip to main content

Namaste NRI

నటుడిగా నాకు ఇంతటి సంతృప్తినిచ్చిన సినిమా : రవితేజ

రవితేజ కథానాయకుడిగా నటించిన డివోషనల్‌ థ్రిల్లర్‌ ఇరుముడి. ప్రియ భవాని శంకర్‌, బేబీ నక్షత్ర, సాయికుమార్‌ కీలక పాత్రధారులు. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్‌ పతాకంపై వై.రవిశంకర్‌, నవీన్‌ యర్నేని నిర్మించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఇరుముడి బ్లాక్‌బస్టర్‌ సెలబ్రేషన్స్‌లో రవితేజ మాట్లాడారు. చెప్పలేనంత ఆనందాన్నిచ్చిన సినిమా ఇరుముడి. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ హ్యాపీగా ఉన్నారు. నాకు చాలా సంతృప్తిని, రెస్పెక్ట్‌ని ఇచ్చిన సినిమా ఇరుముడి. ఈ క్రెడిట్‌ అంతా దర్శకుడు శివ నిర్వాణదే. తనో పని రాక్షసుడు.. పర్‌ఫెక్షనిస్ట్‌. నటుడిగా నాకు ఇంతటి సంతృప్తినిచ్చిన సినిమా మరొకటి లేదు. అందరం ఎంజాయ్‌ చేస్తూ చేశాం. ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని అన్నారు.

చిత్ర దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ ఇది ప్రేక్షకుడి విజయం. భరించలేనంత ఆనందాన్నిచ్చిన సినిమా ఇరుముడి. ఇరవై రోజులుగా పరిశ్రమ నుంచి చాలామంది శ్రేయోభిలాషులు ఫోన్లు చేసి అభినందించారు. వారందరితో మాట్లాడించడానికే ఈ వేడుక. నిజాయితీగా పనిచేస్తే దేవుడే మంచి విజయం ఇస్తాడు. దానికి ఉదాహరణే ఇరుముడి. ఇక నుంచి కూడా ఇంతే నిజాయితీగా పనిచేస్తా అని ఆనందం వెలిబుచ్చారు. ఇంకా చిత్రబృందంతోపాటు ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి, మలినేని గోపీచంద్‌, బుచ్చిబాబు సానా, టీజీ విశ్వప్రసాద్‌, సాహు గారపాటి, కోన వెంకట్‌, బీవీఎస్‌ రవి, చిత్ర పంపిణీదారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events