Namaste NRI

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. రాజధాని వాషింగ్టన్‌లోని పోష్‌ ఏరియా అయిన కనెక్టికట్‌ అవెన్యూలో ఓ సాయుధుడు ఆటోమేటిక్‌ వెపన్‌తో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని, దవాఖానలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. బాధితుల్లో ఒకరు అమ్మాయి కూడా ఉన్నదని తెలిపారు.  కాల్పులకు తెగబడిన వ్యక్తి కోసం ఆ ప్రాంతంలో పోలీసులు గాలింపు చేపట్టారు. కనెక్టికట్‌ను పోలీసులు చుట్టుముట్టారు. దుండగుడు తప్పించుకుపోకుండా అక్కడ లాక్‌డౌన్‌ విధించారు. అపార్టుమెంట్లను జల్లడపడుతున్నారు. నిందితుడిని వీలైనంత తొందరగా పట్టుకుంటామని అసిస్టెంట్‌ పోలీస్‌ చీఫ్‌ స్టువర్ట్‌ ఎమర్‌మెన్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events