ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఆటోపైలట్ టీమ్‌లో తొలి ఉద్యోగిగా భారత సంతతికి చెందిన అశోక్ ఎల్లుస్వామి చేరారు. తన ఆటోపైలట్ టీమ్ కోసం మస్క్ కొద్ది రోజుల కింద సామాజిక మాధ్యమాల ద్వారా రిక్రూట్‌మెంట్ ప్రారంభించారు. కృత్రిమ మేధ ఇంజినీర్లు కావాలని కోరారు. ఇందులో ఎంపికైన తొలి వ్యక్తిగా భారత సంతతికి చెందిన అశోక్ కావడం విశేషం. అశోక్ ఆటోపైలట్ ఇంజనీరింగ్ హెడ్‌గా పనిచేయనున్నట్టు మస్క్ తెలిపారు. ఈ విషయాన్ని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్వీట్ ద్వారా వెల్లడిరచారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/nagachaitanya-1-300x160.jpg)