Namaste NRI

36 మందితో కాంగ్రెస్ తొలి జాబితా… తెలంగాణ నుంచి న‌లుగురికి చోటు

లోక్ స‌భ‌ ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేసిన ఏఐసీసీ ఎట్టకేలకు క్యాండిడేట్ల ఫస్ట్ లిస్ట్‌ను రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా 36 మందితో కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసింది. ఇందు లో తెలంగాణ నుండి నాలుగు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. జహీరాబాద్- సురేష్ షట్కర్, చేవెళ్ల – సునీత మహేందర్ రెడ్డి, నల్గొండ – కుందూరు రఘువీర్, మహబూబాబాద్ – బలరాం నాయక్ పేర్లను ఏఐసీసీ అనౌన్స్ చేసింది.
మహబూబ్ నగర్ స్థానానికి స్వయంగా టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన వంశీచంద్ రెడ్డి పేరు ఈ జాబితాలో లేక‌పోవ‌డం విశేషం.

మొత్తం 36 మందితో కూడిన జాబితాలో రాహుల్ గాంధీ, శశిథరూర్, గీతా శివరాజ్ కుమార్, డీకే సురేష్.. వంటి సీినియర్ల పేర్లు ఉన్నాయి. రాహుల్ గాంధీ మరోసారి కేరళలోని వాయనాడ్ నుంచే లోక్‌సభకు పోటీ పడనున్నా రు. తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్- 6, కర్ణాటక- 6, కేరళ- 15, మేఘాలయా-2, నాగాలాండ్-1, సిక్కిం- 1, త్రిపుర- 1 స్థానానికి అభ్యర్థుల పేర్లను ప్రకటించింది కాంగ్రెస్. కర్ణాటకలోని శివమొగ్గ లోక్‌సభ స్థానానికి శాండల్‌వుడ్ స్టార్ హీరో భార్య గీతా శివరాజ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తమ్ముడు డీకే సురేష్ లు ఉన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events