Skip to main content

Namaste NRI

శ్రీనివాస మంగాపురం నుంచి.. రషా తడానీ ఫస్ట్‌లుక్‌ విడుదల

సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం శ్రీనివాస మంగాపురం. రాషా తడానీ హీరోయిన్ఈ చిత్రానికి అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. అశ్వినీదత్‌ సమర్పిస్తున్న ఈ చిత్రానికి పి.కిరణ్‌ నిర్మాత.ఈ సినిమా నుంచి రషా తడానీ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఇందులో ఆమె సంప్రదాయ దుస్తుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్నది. ఇటీవలే ఈ సినిమా రెండో షెడ్యూల్‌ని మొదలుపెట్టామని, చక్కటి కుటుంబ కథగా మెప్పిస్తుందని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: జయకృష్ణ, సంగీతం: జీవీ ప్రకాష్‌ కుమార్‌, రచన-దర్శకత్వం: అజయ్‌ భూపతి.

Social Share Spread Message

Latest News