అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కొత్తగా ఏర్పాటు చేసిన మూన్ టు మార్స్ ప్రాజెక్టు తొలి అధిపతిగా భారత సంతతి సాఫ్ట్‌వేర్, రొబోటిక్స్ ఇంజనీర్ అమిత్ క్షత్రియ ఎంపికయ్యారు. కొత్త ప్రాజెక్ట్‌కు ఆయన తొలి డైరెక్టర్‌గా వ్యవహరిస్తారని నాసా ప్రకటించింది. మానవాళి ప్రయోజనం కోసం చంద్రుడిపై అధ్యయనానికి సాహసోపేతమైన మిషన్లు నిర్వహించడం, అంగారక గ్రహంపై మనిషిని దింపేందుకు వీలుగా నాసాను సన్నద్ధం చేసే కార్యక్రమాలను రూపొందించడం ఈ కొత్త మిషన్ లక్ష్యమని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ పేర్కొన్నారు. ఇలాంటి ప్రతిష్ఠాత్మక విభాగానికి భారత సంతతి వ్యక్తి నేతృత్వం వహించడం ఇదే మొదటిసారి. 2014 నుంచి 2017 వరకు స్పేస్ స్టేషన్ ఫ్లైట్ డైరెక్టర్ బాధ్యతలు నిర్వర్తించారు. తన సేవలకుగానూ నాసా అవుట్‌స్టాండిరగ్ లీడర్‌షిప్ మెడల్, సిల్వర్ స్నూపీ అవార్డు పొందారు. ఇకపై చంద్రుడి నుంచి అరుణుడి వరకు ప్రాజెక్టు ప్రణాళికల రూపకల్పన, అమలులో ముఖ్య భూమిక పోషించనున్నారు.

