Namaste NRI

ఆర్జీవీ శారీ సినిమా నుంచి ఫస్ట్ రొమాంటిక్‌ సాంగ్ విడుదల

రామ్‌గోపాల్‌వర్మ డెన్‌ నుంచి శారీ  అనే సైకలాజికల్‌ థ్రిల్లర్‌ రాబోతున్న విషయం తెలిసిందే. గిరి కృష్ణకమల్‌ దర్శకత్వంలో రవివర్మ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సత్య యాదు, ఆరాధ్య దేవి హీరోహీరోయిన్లు. నవంబర్‌లో సినిమా విడుదల కానుంది. ఇదిలావుంటే ఈ సినిమా ద్వారా ఓ కొత్త ప్రయోగానికి రామ్‌గోపాల్‌వర్మ శ్రీకారం చుట్టారు.  ఆర్టిఫిషల్‌ ఇంటలిజన్స్‌(ఏఐ) ప్రస్తుతం సాంకేతిక విప్లవానికి తెరలేపిన విషయం తెలిసిందే. ఈ కృత్రిమమేథ సప్తస్వరాలతో విన్యాసాలు చేస్తూ సంగీతకారులందరికీ సవాలు విసురుతోంది. దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తన శారీ చిత్రంలో తొలిసారి ఆర్టిఫిషల్‌ ఇంటలిజెన్స్‌ ప్రక్రియతో మ్యూజిక్‌ డిపార్టెంట్‌తో పనిలేకుండా తానే సంగీత, సాహిత్య, వాయిద్య మేళవింపుగా పాటను తయారు చేశారు. ఐ వాంట్‌ లవ్‌. అంటూ సాగే ఈ పాటను విడుదల చేశారు.

భారత చలనచిత్ర చరిత్రలో ఆర్టిఫిషల్‌ ఇంటలిజెన్స్‌ ప్రక్రియ ద్వారా తయారైన తొలి సినిమా పాట ఇదే కావడం విశేషం. ఇకపై భవిష్యత్‌లో సంగీత దర్శకులు, పాటలు రాసేవాళ్లు, పాడేవాళ్లు చరిత్రగా మిగిలిపోతారనీ, రూపాయి ఖర్చు లేకుండా ఏఐ యాప్‌ ద్వారా సంగీతాన్ని తమకు ఇష్టమైన ట్యూన్స్‌లో సమకూర్చుకోవడమే కాక, వాటిని తమకు ఇష్టమైన వాయిస్‌లో క్షణాల్లో రికార్డ్‌ చేసుకోవచ్చని రామ్‌గోపాల్‌వర్మ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శబరి, నిర్మాణం: ఆర్జీవీ ఆర్వీ ప్రొడక్షన్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events